Gold prices: పెరుగుతున్న ధరలు.. రికార్డు స్థాయికి బంగారం.! 1 y ago

featured-image

బంగారం, వెండి ధరలు బాగా పెరుగుతున్నాయి. బంగారం రేటు అయితే రికార్డులు కొట్టేసింది. వెండి కూడా లక్ష మార్కు దాటి బంగారంతో పాటు పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రకారం బంగారం, వెండి ధరలలో ఎల్లప్పుడూ మార్పులు జరుగుతుంటాయి. విజయవాడ, హైదరాబాద్‌లలో ఇవాళ (మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,700 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,950 కు చేరింది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్లకు రూ.300, 24 క్యారెట్లకు రూ.330 పెరిగింది. కేజీ వెండి ధర రూ.1,08,000 వద్ద స్థిరంగా ఉంది. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD